'బాహుబలి' చిత్రం ఫై యు.ఏ.ఈ అభిమాని స్పందన
- July 11, 2015
ఈ ప్రపంచం లో అన్నింటికన్నా సులువైనది ఏదైనా వుంది అంటే ఉచిత సలహా ఇవ్వడమే లేకపోతే అసంబద్ద విమర్శ . తను చేయలేడు అని తెలుసు, కాని ఎదుటి వాడి కంటే నాకే ఎక్కువ తెలుసు అని అనే అహంకారం ప్రస్తుతం కట్టి కుదిపేస్తోంది. ఇటీవల " బాహుబలి " చిత్రం గురించి వస్తున్న విమర్శలు చదివితే కొంచెం భాద అనిపిస్తుంది. ఎవ్వరు ఏమనుకున్నా ఒకటి మాత్రం నిజం. చరిత్రలో నిలిచిపోయేలా ఒక మంచి చిత్రం రూపొందించిన రాజమౌళి బృందానికి హార్దిక శుభాభినందనలు.
నాకు నచ్చిన అంశాలు :
1. అందమైన ప్రకృతి , హిమగిరి శిఖరాల నుండి జాలువారుతోందా అన్నట్లు అనిపించే జలపాతాలు.
2. అమాయకమైన గిరిజన సంస్కృతి, భగవంతుడి పట్ల అచంచల విశ్వాసాలు కలిగిన నిర్మల హృదయం
3. ఒక ప్రక్క అమ్మ ప్రేమ ను గౌరవిస్తూనే, ఆ దేవదేవుని జలపాత ధారలు అభిషిక్తం చేసేలా స్పందించిన కధానాయకుని తీరు.
4. అప్సోరో భామల అందానికి ముగ్దులై వారి సమాగమం తో అనేక చరిత్రలకు ఆద్యులైన మహనీయులైన వారి వాలే సౌందర్యో పాశకుడై కాంతాన్వేషణ చేసి ఆపైన తన కవ్యనాయకిని చేరుకున్న మగదీరుని తీరు.
5. విశేష శౌర్య పరాక్రములై అటు రాచ నగరిలో, ఇటు యుద్ద భూమిలో సమయోచిత ప్రదర్శన కావించిన పాత్రధారులు.
ఇలా ఒకటేమిటి అన్నీ అద్భుతాలే. ఇన్ని అద్భుతాల ముందు మిగిలిన లోపాలన్నీ చెప్పుకోనవసరము లేనివే.
--సుబ్రహ్మణ్య శర్మ(దుబాయ్)
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







