ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: రచిన్, విలియమ్సన్ సెంచరీలు..
- March 05, 2025
పాకిస్తాన్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహౌర్ వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో కివీస్ రచిన్ రవీంద్ర, కెన్ విలియ్సన్ సెంచరీలతో మెరిశారు. దీంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 366 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 48 పరుగుల వద్ద 21 పరుగులు చేసి ఓపెనర్ విల్ యంగ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్తో రచిన్ రవీంద్ర 164 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. రచిన్ రవీంద్ర 101 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 108 రన్స్ చేసి ఔటయ్యాడు. రచిన్ ఔటయ్యక కేన్ విలియమ్సన్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 37 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్‌తో 49 పరుగులు చేశాడు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







