ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్స్ లో భారత్ తో తలపడనున్న న్యూజిలాండ్
- March 05, 2025
పాకిస్తాన్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లింది. తుది పోరులో భారత్ తో తలపడనుంది. లాహోర్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఫైనల్ కి చేరింది కివీస్.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్ సన్ సెంచరీలతో చెలరేగారు. రచిన్ 101 బంతుల్లో 108 పరుగులు చేయగా, విలియమ్ సన్ 94 బంతుల్లోనే 102 రన్స్ చేశాడు. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ చెరో 49 పరుగులతో విజృభించారు.
363 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 50 ఓవర్లలో 312 పరుగులే చేసింది. ఆ జట్టులో డేవిడ్ మిల్లర్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిల్లర్ 67 బంతుల్లో 100 రన్స్ చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్నాడు. వాన్ డర్ సన్ (69), కెప్టెన్ బవుమా (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరల్లో మిల్లర్ మెరుపులు మెరిపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కానీ, భారీ టార్గెట్ ను ఛేజ్ చేయలేకపోయాడు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







