కార్మికులకు విద్యార్థుల 'బహుమతులు'
- July 04, 2016
రమదాన్ ఛారిటీ డ్రైవ్‌లో భాగంగా అకడమిక్ సిటీలోని కన్‌స్ట్రక్షన్ సైట్ వద్ద అమిటీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, సిబ్బంది, వలంటీర్స్ 11,000 గిఫ్ట్ ప్యాక్‌లను కార్మికులకు అందజేశారు. 100 మందికి పైగా బ్లూ కాలర్డ్ కార్మికులు ఈ బహుమతుల్ని అందుకున్నారు. దుబాయ్ నిర్మాణంలో వీరంతా తెరవెనుక భాగస్వాములుగా వ్యవహరిస్తుండడాన్ని విద్యార్థులు అభినందించారు. కార్మికులు దుబాయ్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారనీ, వారికి బహుమతులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రజత్ సింగ్ చెప్పారు. క్యాంపెయిన్ ఆర్గనైజర్స్, విద్యార్థులు సేవా రంగంలో చూపుతున్న శ్రద్ధను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, కార్మికులు తమకు విద్యార్థులు బహుమతులు అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







