పెట్టుబడులతోనే ఉద్యోగావకాశాలు
- July 04, 2016
ఇన్వెస్ట్‌మెంట్ సెక్టార్‌ని బలోపేతం చేస్తేనే ఉద్యోగావకాశాలు వృద్ధి చెందుతాయని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా చెప్పారు. రిఫ్ఫా ప్యాలెస్‌లో లులు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ యూసుఫ్ అలితో జరిగిన సమావేశంలో ప్రిన్స్ సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధిలో పెట్టుబడుల పాత్ర చాలా గొప్పదనీ, అలాగే స్థిరమైన అభివృద్ధి సాధించడానికి పెట్టుబడులను ప్రోత్సహిస్తామని చెప్పారాయన. లులు గ్రూప్ అభివృద్ధి చెందుతున్న తీరు పట్ల ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు ప్రిన్స్ సల్మాన్. లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ప్రిన్స్ సల్మాన్‌తో భేటీ అవడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. బహ్రెయిన్ కింగ్‌డమ్‌లో లులు గ్రూప్ మరిన్ని పెట్టుబడులతో ఉపాధి అవకాశాల్ని కల్పిస్తుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







