షార్జా కార్మికుల కోసం ఇఫ్తార్, క్రికెట్ మ్యాచ్
- July 04, 2016
స్కైలైన్ యూనివర్సిటీ కాలేజ్ (ఎస్‌యుసి), షార్జా లేబర్ స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌ఎస్‌డి) సంయుక్తంగా ఇఫ్తార్ డిన్నర్ మరియు క్రికెట్ మ్యాచ్‌ని 250 మంది కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఎన్నో కష్టాలను అనుభవించే కార్మికుల్ని కాస్సేపు ఆనందంలో ముంచెత్తడం కోసం, అలాగే ఇఫ్తార్ డిన్నర్ ద్వారా వారిలో సంతోషాన్ని నింపేందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాల పట్ల, సుహృద్భావ వాతావరణం పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేడాదీ క్రికెట్ నిర్వహించడం ద్వారా ఎప్పుడూ క్రికెట్ ఆడేందుకు అవకాశం లేనివారు, ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, తమకూ గుర్తింపు దక్కుతుందన్న ఆనందం వ్యక్తం చేస్తారనీ, కార్మికుల్లో ఈ ఉత్సాహం నింపడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ - ఎస్‌యుసి లెక్చరర్ మరియు చైర్ పర్సన్ మొహమ్మద్ అబ్దు సలాం చెప్పారు. విద్యార్థులు పెద్దవారిని గౌరవించడంలో భాగంగా వృద్ధులు ఉండే ఇంటికి వెళ్ళి, వారి యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. కార్మికులు, క్రికెట్ మ్యాచ్‌ని ఆడి, తిలకించి అమితానందాన్ని పొందారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







