'బాహుబలి' చిత్రం ఫై యు.ఏ.ఈ అభిమాని స్పందన

- July 11, 2015 , by Maagulf
'బాహుబలి' చిత్రం ఫై యు.ఏ.ఈ అభిమాని స్పందన

ఈ ప్రపంచం లో అన్నింటికన్నా సులువైనది ఏదైనా వుంది అంటే ఉచిత సలహా ఇవ్వడమే లేకపోతే అసంబద్ద విమర్శ . తను చేయలేడు అని తెలుసు, కాని ఎదుటి వాడి కంటే నాకే ఎక్కువ తెలుసు అని అనే అహంకారం ప్రస్తుతం కట్టి కుదిపేస్తోంది.  ఇటీవల " బాహుబలి " చిత్రం గురించి వస్తున్న విమర్శలు చదివితే కొంచెం భాద అనిపిస్తుంది. ఎవ్వరు ఏమనుకున్నా ఒకటి మాత్రం నిజం. చరిత్రలో నిలిచిపోయేలా ఒక మంచి చిత్రం రూపొందించిన రాజమౌళి బృందానికి హార్దిక శుభాభినందనలు. 

 

నాకు నచ్చిన అంశాలు :

1. అందమైన ప్రకృతి , హిమగిరి శిఖరాల నుండి జాలువారుతోందా అన్నట్లు అనిపించే జలపాతాలు. 

2. అమాయకమైన గిరిజన సంస్కృతి, భగవంతుడి పట్ల అచంచల విశ్వాసాలు కలిగిన నిర్మల హృదయం 

3. ఒక ప్రక్క అమ్మ ప్రేమ ను గౌరవిస్తూనే, ఆ దేవదేవుని  జలపాత ధారలు అభిషిక్తం చేసేలా స్పందించిన కధానాయకుని తీరు. 

4. అప్సోరో భామల అందానికి ముగ్దులై వారి సమాగమం తో అనేక చరిత్రలకు ఆద్యులైన మహనీయులైన వారి వాలే సౌందర్యో పాశకుడై కాంతాన్వేషణ చేసి ఆపైన తన కవ్యనాయకిని చేరుకున్న మగదీరుని తీరు. 

5. విశేష శౌర్య పరాక్రములై  అటు రాచ నగరిలో, ఇటు యుద్ద భూమిలో సమయోచిత ప్రదర్శన కావించిన పాత్రధారులు. 

ఇలా ఒకటేమిటి అన్నీ అద్భుతాలే.  ఇన్ని అద్భుతాల ముందు మిగిలిన లోపాలన్నీ  చెప్పుకోనవసరము లేనివే.         

 

--సుబ్రహ్మణ్య శర్మ(దుబాయ్)

     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com