నేడు 'బర్ దుబాయి'లో రక్తదానశిబిరం
- July 11, 2015
దుబాయిలోని సర్వ మత నాన్ ప్రాఫిట్ సంస్థ ఐన "ద సైన్స్ ఆఫ్ స్పిరిట్యూవాలిటీ" వారు తమ 21వ రక్తదాన శిబిరాన్ని బర్ దుబాయి, మీనా బజార్ లోని సింధీ మెమోరియల్ సెంటర్లో నేడు ఏర్పాటుచేయనున్నారు. మానవసేవయే ముఖ్యోద్దేశంగా, లతిఫా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాల క్రితం మొదలైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 3000మంది విజయవంతంగా రక్తం దానం చేశారనీ, తద్వారా ఇంచుమించు 10,000మంది జీవితాలను ఆదుకున్నారని తెలియవచ్చింది. రక్తదానం తీసుకునేవారినే కాక, ఇచ్చిన వారికి కూడా మేలు చేస్తుందనీ, రక్తదానం వల్ల రక్తప్రసరణ మెరుగౌతుందని, తద్వారా శరీరంలో ఐరన్ స్తాయి స్థిరంగా ఉంది, రక్తదానం చేసిన ప్రతీసారి ఎర్ర రక్తకణాల ఉత్పత్తి మెరుగౌతుందని శాస్త్రీయంగా నిరూపితమైనట్టు సంస్థ అధికారులు తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు







