17 బంగారు బిస్కెట్లు తీసుకొచ్చా: నటి రాన్యా రావు
- March 07, 2025
బెంగళూరు: కన్నడి నటి రాన్యా రావును ఇటీవల బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.17 బంగారు బిస్కెట్లతో ఆమె బెంగుళూరు విమానాశ్రయంలో పట్టుబడ్డారు. అరెస్టు చేసిన ఆమెను పోలీసులు విచారించారు. తన వాంగ్మూలంలో కొన్ని విషయాలను ఆ నటి వెల్లడించింది.విదేశాల నుంచి 17 బంగారు బిస్కెట్లు తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించింది.రెవన్యూ అధికారులకు ఆ వాంగ్మూలంలో ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేసినట్లు ఎఫ్ఐఆర్ ద్వారా తెలిసింది.గత ఏడాది కాలంలో తాను వెళ్లిన విదేశీ టూర్ల గురించి కూడా ఆమె చెప్పింది.మిడిల్ ఈస్ట్, దుబాయ్తో పాటు కొన్ని పాశ్చాత్య దేశాలకు వెళ్లినట్లు ఆమె పేర్కొన్నది. యూరోప్ వెళ్లాను, అమెరికా, మిడిల్ ఈస్ట్ వెళ్లానని తన వాంగ్మూలంలో రాన్యా రావు తెలిపింది.దుబాయ్, సౌదీ అరేబియా కూడా వెళ్లినట్లు పేర్కొన్నది.ప్రస్తుతం చాలా అలసిపోయానని, ఇంతకన్న ఎక్కువ విషయాలు ఏమీ చెప్పలేనని ఆమె పేర్కొన్నది. గత ఏడాది కాలంలో ఆమె దుబాయ్కు 27 సార్లు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. తన వాంగ్మూలంలో కుటుంబ సభ్యుల వివరాలను ఆ నటి చెప్పింది. తన తండ్రి పేరు కేఎస్ హెగ్డేశ్ అని, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అని, తన భర్త పేరు జతిన్ హుక్కేరి అని, ఆయన ఓ ఆర్కిటెక్ట్ అని ఆమె పేర్కొన్నది. తన తల్లికి చెందిన రెండో భర్త కర్నాటక పోలీసు హౌజింగ్ శాఖ డీజీపీ రాంచంద్రరావు అని ఆమె తన వాంగ్మూలంలో చెప్పింది. ప్రస్తుతం రాన్యా రావు జుడిషియల్ కస్టడీలో ఉన్నది. న్యాయం పై నమ్మకం ఉన్నట్లు తెలిపింది.ఎవరి వత్తిడిలేకుండా, స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చినట్లు పేర్కొన్నది.సోమవారం రాత్రి కెంపగౌడ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారి రాన్యా రావును పట్టుకున్నారు.సుమారు 15 కోట్ల విలువైన 14 కిలోల బంగారు కడ్డీలు ఆమె తీసుకెళ్తూ దొరికింది.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







