యూఏఈ కేంద్రగా పనిచేసే యూకే కంపెనీ మోసం పై విచారణ..!!

- March 10, 2025 , by Maagulf
యూఏఈ కేంద్రగా పనిచేసే యూకే కంపెనీ మోసం పై విచారణ..!!

యూఏఈ: యూఏఈలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న UKకి చెందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థపై ఓ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో భాగంగా UKలోని దాని ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగాయి. 2022లో యూఏఈ మార్కెట్‌లోకి ప్రవేశించిన సెవెన్టీ నైన్త్ గ్రూప్.. పెట్టుబడిదారులకు వారి రుణాలపై అధిక రాబడిని ఆఫర్ చేసిన ఫ్రాడ్ కేసుపై లండన్ నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్‌లోని మెట్రోపాలిటన్ కౌంటీ అయిన మెర్సీసైడ్‌లోని ఐదు వేర్వేరు కంపెనీ బ్రాంచీలపై దాడుల జరిగాయి. ఆయా కార్యాలయాల నుంచి పెద్ద మొత్తంలో నగదు, లగ్జరీ గడియారాలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.  

కంపెనీ అసెట్స్ పై లోన్ నోట్లను విక్రయించడం ద్వారా పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని, £10,000 నుండి ప్రారంభమయ్యే రుణాలపై 12 - 15 శాతం మధ్య రాబడిని హామీ ఇస్తుందని ఫోర్స్ పేర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సెవెన్టీ నైన్త్ గ్రూప్ కెనడా, గినియాలో రియల్ ఎస్టేట్, అసెట్స్ నిర్వహణతోపాటు మైనింగ్‌ రంగంలో కూడా పనిచేస్తుంది. మరోవైపు తమ సంస్థలో ఎటువంటి తప్పులు జరగలేదని ఆరోపణలను కంపెనీ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.  

ఇదిలా ఉండగా, ఈ కేసుపై యూఏఈలోని వ్యాపార వర్గాలలో చర్చకు దారితీసింది. కంపెనీ ఆర్థిక లావాదేవీలలో పెట్టుబడిదారుల రక్షణ, నియంత్రణ పర్యవేక్షణపై ఆందోళనలను లేవనెత్తింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com