దుబాయ్: బిజెపి ఎన్.ఆర్.ఐ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు
- March 10, 2025
దుబాయ్: దుబాయ్ లోని సోనాపూర్ లో జరిగిన తెలంగాణ బిజెపి ఎన్.ఆర్.ఐ సెల్ సమావేశం కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా గెలుపొందిన అంజిరెడ్డి చిన్నామైల్ కి మరియు ఇదే జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గా గెలుపొందిన మాల్క కొమురయ్య గెలుపులో భాగంగా దుబాయ్ లో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల కృషి ఎంతో ఉందని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది.ఎంపి అరవింద్ అలాగే బండి సంజయ్ సూచన మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎన్.ఆర్.ఐ సెల్ నాయకుల కీలక పాత్ర ఉంటుందని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భాగంగా కార్యకర్తల ఆధ్వర్యంలో స్విట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి ఎన్.ఆర్.ఐ సెల్ సభ్యులు నవనీత్ గాజా, ఆరే శరత్ గౌడ్, అపర్ణ, విష్ణు కుంభల,అశోక్ పెనుకూల ,అజయ్, విష్ణు కుంబాల,మదన్, కృష్ణ, కోల శ్రీకాంత్,భగత్ ప్రభు,తటి సురేష్,శ్రవణ్,వినోద్,పురంశెట్టి చంద్రశేఖర్. నర్స రెడ్డి. మరియు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







