పలు దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు వీసా అక్కర్లేదు..
- July 04, 2016
భారతీయులకు పలు దేశాలకు వెళ్లేందుకు వీసా అవసరం లేదు. అక్కడికి వెళ్లాక వీసా మంజూరుచేసే దేశాలు కొన్నయితే, అసలు వీసాయే లేకుండా ఉండొచ్చు. ఆ దేశాల జాబితా ఇది.
బొలీవియా – ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు.90 రోజుల గడువుంది
ఇండోనేషియా – ఈ దేశానికి వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు
ఆండోరా – ఈ దేశానికి భారతీయులు వీసా లేకుండా వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండవచ్చు
మారిషస్ – ఈ దేశానికైతే అసలు వీసానే లేకుండా 90రోజులుండవచ్చు.
కేప్ వెర్డే – ఈ దేశానికి వెళ్ళగానే వీసా ఇస్తారు. గడువు లేదు.
జోర్డాన్ – అక్కడకు వెళ్ళగానే రెండు వారాలకు వీసా ఇస్తారు. కానీ చేతులో 3000 అమెరికన్ డాలర్లు ఉండాలనే నిబంధన ఉంది.
కెన్యా – ఈ దేశానికైతే వెళ్ళిన వెంటనే ఇస్తారు. దాంతో మూడు నెలలు అక్కడ ఉండవచ్చు.
ఫిజీ – ఈ దేశానికి అసలు వీసా లేకుండా నాలుగు నెలలు ఉండవచ్చు.
సోమాలియా – అక్కడికి వెళ్ళగానే ఇస్తారు. కానీ అక్కడికి వెళ్ళడానికి రెండు రోజుల ముందుగానే మిమ్మల్ని ఆహ్వానించిన వారు అక్కడి విమానాశ్రయంలో దరఖాస్తుని సమర్పించాలి.
పలావ్ – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు వీసా ఇస్తారు.
సీషెల్స్ – ఈ దేశానికి వెళ్ళగానే 30 రోజులకు అనుమతి పత్రం ఇస్తారు.
హైతీ – ఈ దేశంలో అసలు వీసా లేకుండా 3నెలలు ఉండవచ్చు.
గునియా బిస్సావ్ – ఈ దేశానికి వెళ్ళగానే 90 రోజులకు వీసా ఇస్తారు.
డామినికా – ఈ దేశానికి వెళ్ళగానే 6నెలలకు వీసా ఇస్తారు.
నౌరూ – ఈ దేశానికి వెళ్లగానే ఇస్తారు. గడువు లేదు.
జమైకా – ఈ దేశానికి వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు.
ఈ సల్వడార్ – ఈ దేశంలో అసలు వీసా లేకుండా 90రోజులు ఉండవచ్చు.
సెయింట్ లూసియా – ఈ దేశానికి వెళ్ళగానే ఇస్తారు. 6 వారాలు గడువు.
మడగాస్కర్ – ఈ దేశానికి వెళ్ళగానే 90రోజులకు అనుమతిస్తూ వీసా ఇస్తారు.
సమో – ఈ దేశంలో వీసా లేకుండానే 30రోజులు ఉండవచ్చు.
లావోస్ – ఈ దేశానికి వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు.
మాల్దీవులు – ఈ దేశానికి వెళ్ళగానే ఇస్తారు. 90రోజుల గడువు.
మైక్రోనేషియా – అక్కడకు వెళ్ళగానే ఇస్తారు. 30రోజుల గడువు.
శ్రీలంక – ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ అనే పద్ధతి అనుమతిస్తారు. గడువు 30రోజులు.
నేపాల్ – ఈ దేశానికి వెళ్ళాలంటే పాస్ పోర్టు కూడా అక్కరలేదు. ఒక గుర్తింపు పత్రం ఏదైనా ఉంటే చాలు. అంతే కాక ఆ దేశానికి వచ్చేభారతీయులు స్వేచ్ఛగా తిరగడమే కాక అక్కడ జీవించవచ్చు కూడా.
టాంజానియా – వీసా అక్కడకు వెళ్ళగానే ఇస్తారు. గడువు లేదు.
కంబోడియా – అక్కడకు వెళ్ళగానే 30రోజులకు వీసా ఇస్తారు.
భూటాన్ – అక్కడకు వెళ్ళాలంటే వీసా అక్కరలేదు. గడువు కూడా లేదు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







