బాబి దర్శకత్వంలో రవితేజ
- July 04, 2016
మా సంటే బస్సు పాసు కాదురా... ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి...' అంటూ 'పవర్'లో పవర్‌ఫుల్ డైలాగు చెప్పాడు రవితేజ. ఆ మాసిజం జనాలకు బాగా నచ్చింది. దాంతో 'పవర్' విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఆ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు బాబి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయిక కుదిరిందన్నది ఫిల్మ్‌నగర్ టాక్. రవితేజ కథానాయకుడిగా డి.వి.వి. దానయ్య ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి బాబి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 'బెంగాల్ టైగర్' తరవాత రవితేజ సినిమా ఏదీ ఇంత వరకూ పట్టాలెక్కలేదు. కథల విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బాబి చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







