'ఏజెంట్ 007' గా రానున్న మహేష్
- November 19, 2016స్టార్ హీరోల సినిమాలకు కథలే కాదు టైటిల్స్ దొరకడం కూడా కష్టమైపోతోంది. పేరులో ఏముంది ఏదో ఒకటి పెడదాం అంటే ఇమేజ్ అడ్డొస్తుంటుంది. స్టార్ హీరో చిత్రానికి ఇంత సాదాసీదా టైటిల్ పెడతారా అంటూ ప్రశ్నిస్తారు. ప్రస్తుతం మహేష్ బాబు కొత్త సినిమాకు పేరు పెట్టే విషయంలోనూ యూనిట్ ఇలాంటి తర్జనభర్జనలే పడుతోంది. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
అయినా పేరు నిర్ణయించలేదు. కథ ప్రకారం హీరో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కాబట్టి 'ఏజెంట్ శివ','ఏజెంట్ 007' అనే రెండు పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో 'ఏజెంట్ 007' ను ఖరారు చేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తదుపరి చిత్రీకరణ కోసం నవంబర్ 24 నుంచి అహ్మదాబాద్ వెళ్లనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు