39 మంది భార్యలు, 94 మంది సంతానం.. ఒకే ఇంట్లో నివసిస్తున్న పెద్ద కుటుంబం

- October 23, 2017 , by Maagulf
39 మంది భార్యలు, 94 మంది సంతానం.. ఒకే ఇంట్లో నివసిస్తున్న పెద్ద కుటుంబం

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం గా ఖ్యాతి గాంచిన కుటుంబం... ఒక కుటుంబంలోని నలుగురు సభ్యుల మధ్యనే అనేక వివాదాలు.. కొట్లాటలు.. కానీ మిజోరమ్ రాష్ట్రంలో 181 మంది ఫ్యామిలీ సభ్యులు గల కుటుంబం ఉంది.. వందగదులతో... నాలుగు అంతస్తుల భవనం... ఆ భవనంలో ఎటువంటి అరమరికలు లేకుండా నివసించే 181 మంది కుటుంబ సభ్యులు.. మరి ఈ కుటుంబం గురించి వివరాల్లోకి వెళ్తే...
మిజోరమ్ రాష్ట్రం బక్తావంగ్ గ్రామంలో ఓ నాలుగు అంతస్తుల భవనం ఉంది.. ఆ భవనం లో ఒకే ఫ్యామిలీకి చెందిన 181 మంది నివసిస్తున్నారు.. వీరంతా 72 ఏళ్ల జియోనా కుటుంబానికి చెందిన సభ్యులు. ఆయనకు 39 భార్యలు.. వారి ద్వారా 94 మంది సంతానం.. ఉన్నారు.. 14 మంది కొడుకులకు పెళ్లిళ్లు కూడా చేశారు.. జియోనా కు 40 మంది మనువలు, మనవరాళ్ళు ఉన్నారు. ఇంత మంది సభ్యులు కలిసి మెలసి.. మొత్తం నాలుగు అంతస్తుల భవనం లో ఉంటారు.. అందరూ కలిసి వంటావార్పు చేసుకొంటారు.. రోజుకి 50 కిలోల బియ్యం, 70 కిలోల మాసం ఈ కుటుంబానికి అవసరం.. అయితే జియోనా ఆగర్భ శ్రీమంతుడట.. దీంతో పెళ్లి మీద పెళ్లి చేసుకొంటూ... 39 మంది భార్యలను సొంతం చేసుకొన్నాడు.. ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. అని అనే మగవారు.. మరి ఈ జియోనా 39 మంది భార్యలతో ఎలా వేగుతున్నాడు అని కామెంట్ చేస్తున్నారు. వయసులో ఉన్నప్పుడూ జియోనా తన కుటుంబ పోషణ మొత్తం తానే చూసుకున్నాడు.. కానీ ఇప్పుడు కుటుంబ పోషణ భాద్యత మొత్తం కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు.. తలా ఓ పని చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందరూ కలిసి మెలసి.. నవ్వుతూ సంతోషంగా గడుతున్నారు.. కాగా జియోనా ఫ్యామిలీ కి సంబంధించిన ఫోటోలో గతంలోనే హల్ చల్ చేయగా.. తాజాగా ఆ కుటుంబానికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com