ఖతార్ ఎయిర్‌వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- April 30, 2024
దుబాయ్: దుబాయ్ అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) సందర్శకులు ఇప్పుడు ప్రపంచంలోని మొదటి AIతో పనిచేసే క్యాబిన్ సిబ్బందిలోని రెండవ తరంతో చర్చకు అవకాశం పొందుతారు. ఖతార్ ఎయిర్‌వేస్ సామా 2.0 రియల్ టైమ్ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. ప్రయాణీకులకు క్యూరేటెడ్ ప్రయాణ అనుభవాలను రూపొందించడంలో సహాయపడుతుంది. వచ్చే వారం ఈవెంట్‌లో తరచుగా అడిగే ప్రశ్నలు, గమ్యస్థానాలు, ట్రావెల్ చిట్కాలు వంటి వాటికి సమాధానాలను ఇవ్వనుంది. డిజిటల్ ఏఐ సిబ్బంది మే 6 నుండి 9 వరకు హాల్ నెం.2లోని ఖతారీ ఎయిర్‌వేస్ పెవిలియన్‌లో జరిగే దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వార్షిక ప్రదర్శనలో సందడి చేయనున్నారు. ఖతార్ ఎయిర్‌వేస్ కస్టమర్‌లు ఎయిర్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ QVerse లేదా దాని యాప్ ద్వారా సామా 2.0తో సంభాషించవచ్చు. దుబాయ్ క్యారియర్ ఈ సంవత్సరం మార్చిలో ITB బెర్లిన్‌లో హోలోగ్రాఫిక్ వర్చువల్ క్యాబిన్ క్రూ సామా 2.0ని ప్రారంభించింది.
ఇదిలా ఉండగా సోఫియా అనే మరో హ్యూమనాయిడ్ రోబో గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తోంది. సౌదీ అరేబియా 2017లో రోబోకు - సోఫియాకు పౌరసత్వాన్ని మంజూరు చేసిన ప్రపంచంలోనే మొదటి దేశంగా అవతరించింది.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







