'గృహం' మూవీ రివ్యూ

- November 17, 2017 , by Maagulf
'గృహం' మూవీ రివ్యూ

చిత్రం: గృహం 

 

మర్ ఇండస్ర్టీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోల్లో సిద్ధార్థ్ ఒకడు. ఇటు తెలుగు.. అటు తమిళంలో సఫీషియంట్ మార్కెట్‌ని దక్కించుకోవడమేకాదు.. కావాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇదంతా గతం! ఇటీవలికాలంలో అతడు నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. ఈసారి తన ఇమేజ్‌కి పూర్తి భిన్నంగా వెళ్లాడు. సిద్ధార్థ్ నటించి, నిర్మించిన తమిళ హారర్ థ్రిల్లర్ 'అవల్‌'.. తెలుగులో 'గృహం' పేరుతో శుక్రవారం థియేటర్స్‌కి వచ్చింది. వరస ప్లాపులతో సతమతమవుతున్న సిద్ధార్థ్‌కి ఈ 'గృహం' కలిసొస్తుందో లేదో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లొద్దాం..
స్టోరీ.. బ్రెయిన్ సర్జరీ స్పెషలిస్ట్ క్రిష్ (సిద్ధార్థ్). అతని వైఫ్ లక్ష్మి (ఆండ్రియా)తో కలిసి హిమాలయాల వద్ద ఓ ప్రాంతంలో వుంటాడు. వీళ్ళ ఇంటి పక్కనేవున్న మరో హౌస్‌లో బిజినెస్‌మేన్ పాల్ (అతుల్ కులకర్ణి) వుంటుంది.

వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అన్నీ వింతగా జరగడం మొదలవుతాయి. ఆ తర్వాత పాల్ కూతురు జెన్నీ డిఫరెంట్‌గా బిహేవ్ చేసేది. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వింతగా ప్రవర్తించడం అనేది కేవలం ఓ వ్యాధిగా భావించిన క్రిష్..

డాక్టర్ (సురేష్)తో కలిసి యువతికి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటాడు. ఐనా, జెన్నీ సమస్యను కనిపెట్టలేకపోతాడు. దీంతో పాల్‌ ఓ పాస్టర్‌ సాయం తీసుకుంటాడు. జెన్నీలో లీజింగ్‌ అనే దెయ్యం ఉందన్న సంగతి తెలుస్తుంది.

పాల్ ఫ్యామిలీ వల్ల క్రిష్- లక్ష్మీలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఇంతకీ లీజింగ్‌ ఎవరు? అనేది తెరపై చూడాల్సిందే!
విశ్లేషణ... తక్కువ పాత్రలతో స్టోరీని నడిపించాడు డైరెక్టర్ మిలింద్‌రావ్.

సింపుల్‌గా చెప్పాలంటే కథంతా క్రిష్- జెన్నీ క్యారెక్టర్ల చుట్టూనే తిరుగుతుంది. 80 ఏళ్ల కిందట భారత్‌లో సెటిలైన చైనా దంపతుల స్టోరీతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా సాగుతుంది. తొలుత 'చంద్రముఖి' మాదిరిగా అనిపించినా క్రమంగా ఆ ముద్ర చెరిగిపోయేలా స్ర్కీన్ ప్లేని అల్లేశాడు డైరెక్టర్.

ఆరంభంలో సిద్ధార్థ్‌ పాత్ర నార్మల్‌గా అనిపించినా, సెకండాఫ్‌లో ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. డాక్టర్ పాత్రకు తగ్గట్లే బాడీ లాంగ్వేజ్‌ను చూపించి మెప్పించాడు. క్లైమాక్స్ కోసం ఎక్కువగా కష్టపడ్డాడు. సిద్ధార్థ్- ఆండ్రియా మధ్య రొమాన్స్ బాగా కుదిరింది.

లిప్‌లాక్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు హీరోయిన్. ఇక జెన్నీగా కనిపించిన అమ్మాయి గ్లామర్‌ పరంగా సాదాసీదాగా వున్నా, నటన విషయంలో సిద్ధార్థ్‌కు పోటీగా నిలిచింది. లీజింగ్‌ ఆత్మ ఆవహించిన తరుణంలో ఆమె హావభావాలు ప్రేక్షకుల్ని భయపెట్టాయి. కూతురిని కాపాడుకోవాలనే పాత్రలో అతుల్ కులకర్ణి చక్కగా ఒదిగిపోయాడు.

మిగతావాళ్లు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. టెక్నికల్ పరంగా చూస్తే.. స్క్రీన్‌ప్లే బాగుంది. సౌండ్‌, విజువలైజేషన్‌ పర్వాలేదనిపించాయి.

సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేస్తే ఇంకా బాగుండేది. ఎప్పుడూ యూత్‌ ఓరియంటెడ్ సినిమాలు చేసే సిద్ధార్థ్‌.. ఈసారి ఓ హర్రర్‌ మూవీని ఎంచుకోవడమే విశేషం. దాన్ని సక్సెస్ చేయగలిగాడు కూడా!

పెద్ద సినిమాలు ఏవీ పోటీలేని సమయంలో రిలీజ్ కావడంతో 'గృహం'కి ఇవి మంచిరోజులే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com