టమోటా మాల్పురి
- November 22, 2017కావలసిన పదార్థాలు: బెంగళూరు టమో టాలు-4, మైదాపిండి - ఒక కప్పు, బేకింగ్ పౌడర్- పావు టీ స్పూను, పాలు- ఒక టేబుల్ స్పూను, నెయ్యి- అర కప్పు, పచ్చికొబ్బరి కోరు - ఒక కప్పు, యాలకులపొడి- కొద్దిగా, పంచదార పొడి - రెండు టేబుల్ స్పూన్లు, కిస్మిస్లు, బాదంపలుకులు, జీడిపప్పు- కొద్దిగా
తయారీ విధానం: టమోటాలు వేడినీళ్ళలో వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత తొక్క తీసి పండుని మిక్సీలో వేసి రుబ్బుకుని గుజ్జు తీసుకోవాలి. ఇందులో మైదాపిండి వేసి బాగా కలపాలి. పాలు, బేకింగ్ పౌడర్, పంచదార కూడా వేసి పిండిని జారుగా కలపాలి. ఇప్పుడు ఒక నానస్టిక్ పెనం పొయ్యి మీద పెట్టి గరిటతో పిండిని దోసెల్లా పోయాలి. దాని మీద నెయ్యి వేసి ఒకవైపు కాలాక తిరగేసి మళ్ళీ నెయ్యి వేసి కాల్చాలి. ఇలా అన్నీ చేసుకున్నాక ప్లేటులో పెట్టి మడతలు వేయాలి. వీటిపైన పచ్చి కొబ్బరి, కిస్మిస్లు, జీడిపప్పు, బాదంపప్పు, చెర్రీ పెడితే చూడడానికి అందంగా ఉండటమేకాక రుచిగా కూడా ఉంటాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్