వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు

- April 28, 2024 , by Maagulf
వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు

యూఏఈ: యూఏఈలో మే 2న వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం అలెర్ట్ జారీ చేసింది. వివిధ ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, ఇది దుమ్ము మరియు ఇసుకను వీయడానికి దారితీస్తుందన్నారు.అదే సమయంలో లో విజిబిలిటీ ఉంటుందన్నారు. గాలుల వేగం గంటకు 25 నుండి 35 కి.మీ వరకు ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో గంటకు 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసారు. అరేబియా గల్ఫ్‌లో సముద్ర పరిస్థితులు చాలా ఉధృతంగా ఉండే అవకాశం ఉందని, ఒమన్ సముద్రంలో ఓ మోస్తరు నుంచి ఉధృతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com