బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!

- April 28, 2024 , by Maagulf
బహ్రెయిన్ లో వారంపాటు \'అస్థిర\' వాతావరణం..!

మనామా: అరేబియా ద్వీపకల్పం మీదుగా కొత్త వాయు గుండం ఏర్పడిందని, దీని ఫలితంగా బహ్రెయిన్ రాజ్యంలో వాతావరణ అస్థిరత ఏర్పడుతుందని బహ్రెయిన్ రవాణా మరియు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని వాతావరణ విభాగం వెల్లడించింది. ఏప్రిల్ 30 నుండి  మే 4 వరకు కొనసాగుతుందని, ఈ సమయంలో మోస్తరు నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని, అధికారులు ఇచ్చిన సలహాలను పాటించాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com