రెండు ముక్కలుగా తెగి పోయిన చేతిని శస్త్రచికిత్స ద్వారా సరిచేసిన సౌదీ వైద్యులు..
- February 18, 2018రియాద్ : రెండు ముక్కలుగా తెగిపోయిన చేతిని అద్భుతమైన శస్త్రచికిత్స ద్వారా తిరిగి యధాతధంగా కలిపి అపర బ్రహ్మలుగా సౌదీఅరేబియా వైద్యులు అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆసియాకు చెందిన ఓ కార్మికుడు సౌదీలో పనిచేస్తుండగా ఆ వ్యక్తి చెయ్యి రెండు ముక్కలుగా తెగిపడింది. మణికట్టు దిగువన చెయ్యి పూర్తిగా తెగిపోయింది. బాధితుడిని సౌదీ తూర్పు ప్రావిన్స్‌లోని ఖోబర్‌లోని కింగ్ ఫహద్ యూనివర్సిటీ హాస్పిటల్ కు శుక్రవారం తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యులు దాదాపు 6 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా చేతిని రెండుగా అతికించినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ షహ్రనీ తెలిపారు. తమ ఆసుపత్రిలో అత్యాధునికమైన సౌకర్యాలు, వైద్యుల నైపుణ్యం, వారి ఏకాగ్రత, పట్టుదలే ఈ ఆపరేషన్ విజయవంతానికి ముఖ్య కారణమని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు