భర్త గల్ఫ్‌దేశంలో ఉద్యోగం.. భార్య ఏం చేసిందంటే...
- April 30, 2018
భర్త చేతిలో భార్య హత్య. భార్యను దారుణంగా చంపిన భర్త. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. ఇంతలా భర్తలు భార్యనుమర్డర్ చేయడానికి కాణాలేంటి? కుటుంబ కలహాలా? అక్రమ సంబంధాలా?
పెళ్లిలో చేసిన ప్రమాణాలు మరిచిపోతున్నారు. పతియే ప్రత్యక్షదైవం అనే పెద్దల మాటలను లెక్కచేయడం లేదు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని పచ్చిన కాపురంలో కలహాలు తెచ్చుకుంటున్నారు. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. కుందుకడవు గ్రామానికి చెందిన బిరాజ్ (39) గల్ప్ దేశంలో వెల్డరుగా పనిచేస్తున్నాడు. జీతు అనే యువతిని పెళ్లి చేసుకున్న బిరాజ్ పెళ్లి అనంతరం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భర్త గల్ఫ్ వెళ్లటంతో భార్య జీతు షాపులో పనిచేస్తూ ఫేస్‌బుక్ ద్వార పరిచయమైన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన బిరాజ్ భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొని దరఖాస్తు చేశాడు. దీంతో జీతు పుట్టింటికి వెళ్లింది. భార్య మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుందనే విషయాన్ని తట్టుకులేని భర్త కోపంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన జీతును ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







