జానకికి అరుదైన పురస్కారం

- May 22, 2018 , by Maagulf
జానకికి అరుదైన పురస్కారం

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మాణం తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ సంవత్సరం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం అందచేస్తారు. ఈ ఏడాది ఆ అవార్డును ప్రముఖ గాయని ఎస్‌ జానకికి అందజేయనున్నారు. శ్రీ విజేత ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘జానకమ్మ ఆశీస్సులతోనే ఇంత పెద్ద గాయకుడిని అయ్యా ఆమె సత్కరించుకనే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నా’నన్నారు బాలు.

ఎన్నో అద‍్భుత గీతాలతో ప్రేక్షకులను అలరించిన జానకీ 17 భాషల్లో దాదాపు 45000 వేల పాటలు పాడారు. ఇందులో జపనీస్‌, జర్మన్‌ లాంటి విదేశీ భాషలు కూడా ఉండటం విశేషం. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గాను నాలుగు జాతీయ అవార్డులతో పాటు 33 వివిధ రాష్ట్రాల అవార్డులు ఆమెను వరించాయి. 2016లో ఓ మలయాళ చిత్రానికి తన చివరి పాటను ఆలపించిన జానకీ తరువాత రిటైర్మెంట్‌ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com