విమాన ప్రయాణీకులకు శుభవార్త
- May 22, 2018
ఇండియా:తడిచి మోపెడవుతున్న కాన్సిలేషన్ చార్జీలతో ఇబ్బందులుపడుతున్న విమాన ప్రయాణికులకు విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమాన టికెట్లను బుక్ చేసుకున్న 24 గంటలలోపు కాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం వెల్లడించారు. కొత్తగా ఎయిర్ సేవా డిజి యాత్రా పథకాన్ని లాంచ్ చేయనున్నట్టు తెలిపారు.
కొన్ని సంస్కరణలపై తాజా ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
- బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో టిక్కెట్లను రద్దు చేసుకుంటే..చార్జి ఉండదు.
- బేస్ ఫేర్ +ఇంధన చార్జీని మించి కాన్సిలేషన్ చార్జీలు ఉండకూడదు.
- ప్రత్యేక అవసరాలతో ప్రయాణించేవారికోసం ప్రత్యేక సదుపాయం.
- విమాన ఆలస్యంలో ఎయిర్‌లైన్స్ తప్పు ఉంటే విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
- నాలుగు గంటలకు మించి ఆలస్యమైతే పూర్తి ఫీజు వాపసు.
- ఆలస్యం ఒకరోజు దాటితే ప్రయాణికులకు హోటల్‌లో బస తదితర సౌకర్యాలు కల్పించాలి.
- టికెట్ బుకింగ్‌నకు ఆధార్ తప్పని కాదు. అయితే డిజీ యాత్రలో నమోదు సమయంలో మాత్రమే ఆధార్ అవసరమవుతుందనీ, డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టామని జయంత్ సిన్హా తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







