ట్రంప్, పుతిన్ కీలక భేటీ!!.
- July 16, 2018హెల్సింకి : చిరకాల ప్రత్యర్థులైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా, అమెరికాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి ఈ సమావేశం దోహదపడనుందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి. రష్యాతో సంబంధాలు చెడిపోవడానికి ఎఫ్బిఐ కారణమని ట్రంప్ సమావేశానికి ముందు ఆరోపించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు ఎఫ్బిఐ బాధ్యత వహించాలని ట్రంప్ అన్నారు. రష్యాతో సంబంధాలు అధ్వానంగా ఉండటానికి అమెరికా పిచ్చితనం, మూర్ఖత్వమే కారణమని ట్రంప్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. సిరియా అంతర్యుద్ధం, ఉక్రెయిన్, అమెరికా ఎన్నికల్లో జోక్యం, అణు విస్తరణ, తదితర అంశాలపై పుతిన్‌తో చర్చించనున్నట్లు ట్రంప్ చెప్పారు. ప్రపంచంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం దోహదపడుతుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్