యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!

- May 11, 2024 , by Maagulf
యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!

యూఏఈ: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఇటీవల 2023కి సంబంధించి రోడ్డు భద్రత గణాంకాలపై 'ఓపెన్ డేటా'ను విడుదల చేసింది. ఏ రోడ్లు మరియు వీధుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయో అందులో వెల్లడించింది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311), అబుదాబిలోని అల్ ఫలాహ్ నుండి రస్ అల్ ఖైమా (RAK) వరకు ఉన్న ప్రధాన రహదారిలో గత సంవత్సరం 266 మంది ప్రమాదాలకు గురయ్యారు. ఇందులో 223 మంది గాయపడగా,  43 మంది మరణించారు. రెండవ అత్యంత ప్రమాదకరమైన రహదారి ఎమిరేట్స్ రోడ్. దీనిపై 18 మరణాలుచోటు చేసుకోగా, 104 మంది గాయపడ్డారు.   

దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్ లో 16 మరణాలు, 131 గాయపడ్డ సంఘటనలు జరిగాయి. ప్రమాదాల్లో ఇది మూడవ స్థానంలో ఉంది. నాల్గవ స్థానంలో అబుదాబి-అల్ ఐన్ రోడ్ 171 మందికి గాయాలు, 13 మరణాలు చోటుచేసుకున్నాయి. షేక్ మక్తూమ్ బిన్ రషీద్ రోడ్ 134 మందితో ఐదవ స్థానంలో నిలిచింది. ఇందులో 12మంది మరణించారు. 

యూఏఈలో మిగిలిన ఐదు అత్యంత ప్రమాదకరమైన రోడ్లు:

ర్యాంక్- రోడ్డు- మరణాలు-గాయపడ్డవారి సంఖ్య

6. అబుదాబి-అల్ సిలా -11 -62

7. దుబాయ్-అల్ ఐన్ -10 -19

8. టారిఫ్ -7 -24

9. ఖోర్ ఫక్కన్ -7 -17

10. అల్ ఖైల్ -5 -154

డేటా ప్రకారం.. మరణాల జాబితాలో అబుదాబి అగ్రస్థానంలో ఉండగా, 2023లో అత్యధిక సంఖ్యలో గాయపడినవారిలో దుబాయ్ అగ్రస్థానంలో ఉంది.

రోడ్డు మరణాలు:

అబుదాబి 133

దుబాయ్ 121

షార్జా 34

రాస్ అల్ ఖైమా 30

ఉమ్ అల్ క్వైన్ 16

అజ్మాన్ 11

ఫుజైరా 7

ప్రమాదాల్లో గాయపడ్డవారు:

దుబాయ్ 2,607

అబుదాబి 1,850

షార్జా 387

రాస్ అల్ ఖైమా 326

ఫుజైరా 202

అజ్మాన్ 133

ఉమ్ అల్ క్వైన్ 63

2023లో దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల్లో 352 మంది మరణించారు. 2022లో 343 మరణాలతో పోలిస్తే 3 శాతం పెరిగాయి.  అయితే 2021లో నమోదైన 381 మరణాలతో పోలిస్తే 8 శాతం తగ్గాయి.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com