ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- May 11, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశంలో నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఇవాళ ముగిసింది. మొత్తం 96 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 13న జరిగే నాలుగో దశ ఎన్నికల్లో 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో (96 లోక్‌సభ స్థానాలకు) ఎన్నికలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ (25 లోక్‌సభ స్థానాలు), తెలంగాణ (17), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకశ్మీర్ (1) స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలోని అసెంబ్లీ కంటోన్మెంట్ ఎన్నిక కూడా మే 13నే జరుగుతుంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల ప్రచార హడావిడి తగ్గింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించారు నేతలు.
ఏపీ, తెలంగాణలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 5 లోక్‌సభ నియోజక వర్గాల్లోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథనితో పాటు మిగిలిన సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం 4 గంటలకే ముగిసింది.
144 సెక్షన్ అమలు
ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు అవుతుంది. నలుగురి కంటే అధికంగా వ్యక్తులు గుంపుగా తిరగవద్దు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి ప్రచారం చేయొద్దు. జూన్ 1వ తేది వరకు సాయంత్రం 6.30 నిమిషాల వరకు ఎగ్జిట్ పోల్స్ బ్యాన్ ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!