విమానం కూలే ముందు ప్రయాణికులు ఎలా ఉన్నారో...
- July 19, 2018విమానం కూలే ముందు భయం ఎలా ఉంటుందో ఈ వీడియోలో కనిపిస్తుంది. వండర్‌బూమ్ ఎయిర్ పోర్టు నుంచి నెదర్లాండ్‌కు వెళుతున్న ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటన దక్షిణాఫ్రికా కేప్‌టౌన్ వద్ద జరిగింది.1954లో తయారు చేసిన విమానాన్ని నెదర్లాండ్‌లోని మ్యూజియంకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఫైలెట్, కో ఫైలెట్ సహా మొత్తం 19 ప్రయాణికులు అందులో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక ఇంజనీర్, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే ప్రమాదానికి ముందు అందులోని వ్యక్తి విమాన రెక్కలను వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో రెక్కకు కొంచెం కొంచెంగా మంటలు వ్యాపించడం వీడియోలు స్పష్టంగా కనిపించింది. అయితే కొద్ది సేపటి తరువాత ఆ వీడియో ఆగిపోయింది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగిందని అర్ధమవుతుంది. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలు, కాపాడండంటూ వారిలోని భయం స్పష్టంగా రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!