భారీ వర్షంతో తడిసి ముద్దైన హైదరాబాద్
- August 09, 2018హైదరాబాద్:అల్పపీడన ప్రభావంతో గురువారం సాయంత్రం భాగ్యనగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడే నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాత్రి 10 గంటల వరకు 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో నగరంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళా ఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!