కేరళ:తప్పించుకునే మార్గం లేదు.. కాపాడండి ప్లీజ్
- August 16, 2018భారీ వర్షలకు కేరళ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ప్రకృతి ప్రకోపానికి జన జీవనం అస్థవ్యస్థమైంది. సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలోని కొంత భాగం ఇంకా నీటిలోనే ఉంది.
ఓ వ్యక్తి తన ఇల్లు నీటిలో మునిగిపోయిందని, రెండో ఫ్లోర్కి కూడా నీరు రావడంతో పీకల్లోతు నీటిలో మునిగిపోయానని సెల్పీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దయచేసి నన్ను కాపాడండి అంటూ రాష్ట్ర అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ సత్వర చర్యలు తీసుకుంటున్న దాఖలాలేవీ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కేరళ వాసులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారని, వారందరిని వరద భారి నుంచి కాపాడమంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. తామెంత డేంజర్లో ఉన్నామో తెలిపేందుకే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానని తెలిపాడు. కొన్ని రోజుల పాటు భవనం ఇలాగే నీటిలో ఉంటే గోడలు నాని ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని బాధితుడు తెలిపాడు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం