వాజ్‌పేయి పార్థివ దేహం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలింపు
- August 16, 2018
ఢిల్లీ:మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి పార్థివ దేహాన్ని కృష్ణ మీనన్ మార్గ్ నివాసం నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఉంచారు. దీంతో అభిమానులు బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల బీజేపీ నేతలు ఢిల్లీ చేరుకొని వాజ్‌పేయి కి నివాళి అర్పిస్తున్నారు. కాగా అటల్ జీ.. ఇక లేరన్న వార్త యావత్ భారతప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదిలావుంటే బీజేపీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వాజ్‌పేయి పార్థివదేహం సందర్శనకు అనుమతిస్తారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. యమునానది ఒడ్డున అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌ఘాట్ సమీపంలో యమునానది ఒడ్డునే రాష్ట్రీయ స్మృతిస్థల్ కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







