విడుదలకు రెడీ అవుతున్న 'ఉన్మాది'
- November 12, 2018ప్రవీణ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై ఎన్.కరణ్ రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'ఉన్మాది'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఎన్.ఆర్.రెడ్డి మాట్లాడుతూ - "ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. గుంటూరు జిల్లాలోని నకరికల్లు గ్రామంలో పచ్చని పొలాలు మధ్య ముప్పై రోజుల పాటు జరిగిన సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణను పూర్తి చేశాం. 8ఫైట్స్, 5 సాంగ్స్‌తో సినిమా పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం. అలాగే పాటల విడుదల తేదీ కూడా ప్రకటిస్తాం" అన్నారు. టైటిల్ పాత్రలో ఎన్.ఆర్.రెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించారు. అల్లు రమేశ్, శివ, శిరీష, నాగిరెడ్డి, రమ్య, ప్రమీల, పుష్పలత, సోను, రాజేశ్వరి, డిఎస్పి, వెంకటాంజనేయులు, ఫణి సూరి, మున్నా, జానకి రామయ్య తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్, కెమెరా: దంటు వెంకట్, ఎడిటర్: కె.ఎ.వై.పాపారావు, ఫైట్స్: దేవరాజ్, కొరియోగ్రఫీ: సామ్రాట్, జోజో, నిర్వహణ: ఎన్.వరలక్ష్మి, క్రియేటివ్ డైరెక్టర్ : రాఘవ, నిర్మాత: ఎన్.రామారావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.ఆర్.రెడ్డి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు