శేఖర్ కమ్ముల కొత్త చిత్రం లాంచ్ అయ్యింది..
- November 12, 2018
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మరో రొమాంటిక్ కథతో ప్రేక్షకుల్ని 'ఫిదా' చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారు. వరుణ్ తేజ, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన 'ఫిదా' చిత్రంతో సూపర్ హిట్ ని సొంతం చేసుకొన్న ఆయన, యేడాది పైగా దాదాపు 16 నెలలు గడిచినా కొత్త సినిమాని మాత్రం ప్రకటించలేదు. స్క్రిప్టు రాసుకుంటూ కూర్చున్నారు. మొత్తానికి అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ రోజు సినిమాని లాంచ్ చేసారు.
మ్యూజికల్ డ్రామా గా సాగే ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ లోని ఆసియన్ సినిమాస్ ప్రొడక్షన్ ఆఫీస్ లో ప్రారంభమైంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ఓ కొత్త కుర్రాడు ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. వచ్చే వేసవి కు ఈ సినిమాని రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్.
ఇక నటీనటులు ఎవరనేది తెలియలేదు కానీ... తన ఈ సినిమా మాత్రం ఓ పూర్తి స్దాయి ప్రేమకథతో తెరకెక్కబోతోందని స్పష్టమైంది. పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో విజయవంతంగా కొనసాగుతున్న ఏషియన్ గ్రూప్ తొలిసారి నిర్మాణంలోకి అడుగుపెట్టి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా రూపొందించబోతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







