కేసీఆర్ బయోపిక్ 'ఉద్యమ సింహం' ఫస్ట్ లుక్
- November 13, 2018తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితం బయోపిక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఉద్యమ సింహం' అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ నేడు(మంగళవారం) చిత్రబృందం విడుదల చేసింది. కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. కేసీఆర్ బాల్యం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనతో కూడిన పలు అంశాల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 16న ఆడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం