'యాత్ర' లో అనసూయ ఫస్ట్ లుక్.!
- November 13, 2018
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయళం సూపర్‌స్టార్ మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో నటిస్తుండగా , 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు ప్రజల ఆరాధ్య ప్రజానాయాకుడు కీర్తిశేషులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథను దర్శకుడు మహి వి రాఘవ్ స్వయంగా రాసుకుని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా లో రంగస్థలం ఫేమ్ రంగమ్మత్త అనసూయ విలేకరి పాత్రలో కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
తాజాగా సెట్‌లో ఉన్న కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు తీసిన ఫోటోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది అనసూయ. యాత్ర, మమ్ముట్టి, మహి వి రాఘవ్‌లకి యాష్ ట్యాగ్‌లని జత చేసిన అనసూయ తన పాత్రకి సంబంధించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్ కనిపించనున్నారట. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం డిసెంబర్ 21న వైఎస్సార్ తనుయుడు వైఎస్ జగన్ పుట్టిన రోజు కానుకగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







