పంచె కట్టులో బాలకృష్ణ..
- December 01, 2018నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహానటుడు స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా , బాలయ్య స్వయంగా నిర్మిస్తుండగా సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2019 జనవరి 9న 'యన్.టి.ఆర్-కథానాయకుడు', జనవరి 24న 'యన్.టి.ఆర్- మహానాయకుడు'గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు పోస్టర్స్ విడుదల కాగా, తాజాగా మరో అదిరిపోయే స్టిల్ ను విడుదల చేసి సినిమాపై ఇంకాస్త అంచనాలు పెంచారు. రేపు ఉదయం 7.42ని.లకి ఎన్టీఆర్- కథానాయకుడు లో కథానాయక అంటూ సాగే సాంగ్‌ని విడుదల చేస్తున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలియజేసారు. ఈ పోస్టర్లో బాలయ్య.. ఎన్టీఆర్ గెటప్‌లో పంచె కట్టుకొని కనిపిస్తున్నాడు. అసెంబ్లీ ముందు వీరావేశంతో నడుస్తున్నట్టు ఉన్న ఈ పోస్టర్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ మూవీ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటించగా, చంద్రబాబు పాత్రలో రానా ఇతర పాత్రల్లో పలువురు సీనియర్ స్టార్స్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు