విశ్వాసం సెన్సార్ పూర్తి
- December 24, 2018తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్లో ఇంతకుముందు వీరం, వేదాళం, వివేకం సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నాలుగవ చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై, టి.జి.త్యాగరాజన్ సమర్పణలో, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న మూవీ, విశ్వాసం.. నయన తార హీరోయిన్గా నటిస్తుంది. అజిత్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన అజిత్ లుక్స్, మోషన్ టీజర్ అండ్ సాంగ్స్.. తల ఫ్యాన్స్‌తో పాటు, ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటున్నాయి. విశ్వాసం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ బృందం, ఎటువంటి కట్స్, డైలాగ్ మ్యూట్ వంటివి చెప్పకుండా, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే, సినిమా చాలా బాగుందని విశ్వాసం టీమ్‌ని సెన్సార్ సభ్యులు ప్రశంసించారట. ఇంతకుముందు అజిత్ నటించిన వీరం, వేదాళం, వివేకం సినిమాలకు కూడా సెన్సార్ వాళ్ళు, యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు విశ్వాసంకి కూడా క్లీన్ యూ ఇవ్వడంతో, వాటిలానే విశ్వాసం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తల అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. విశ్వాసం, 2019 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజవనుంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!