కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ల దుష్ప్రభావాలు లేవు..!

- May 02, 2024 , by Maagulf
కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ల దుష్ప్రభావాలు లేవు..!

కువైట్: కోవిడ్-19 వ్యాక్సిన్‌ల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు గుర్తించలేదని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్‌లో అందుబాటులో ఉన్న టీకాలు అంతర్జాతీయ ప్రత్యేక వైద్య సంస్థలచే ఆమోదించబడ్డాయని పేర్కొన్నది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  కోవిషీల్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ 2021 నుండి రక్తం గడ్డకట్టడానికి కారణమైందని ఇటీవలి నివేదికలు రావడంతో అనేక ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి.  అయితే, టీకా ప్రయోజనం అరుదైన దుష్ప్రభావాల కంటే చాలా పెద్దదని, ప్రత్యేకించి మహమ్మారి నుంచి వృద్ధులు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిని కాపాడిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com