ఏపీలో 46,389 పోలింగ్‌ కేంద్రాలు..

- May 02, 2024 , by Maagulf
ఏపీలో 46,389 పోలింగ్‌ కేంద్రాలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లకు సంబంధించిన వివరాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

ఇక ఈ ఎన్నికల కోసం మొత్తం 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖేశ్ కుమార్ మీనా వివరించారు. ఒక్కో కేంద్రంలో 1500 మంది ఓట్లు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య అంతకంటే పెరిగినప్పుడు ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని…. 224 ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపామన్నారు.


64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్…

రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్‍కాస్టింగ్ చేయాలని పర్యవేక్షకుల నుంచి సిఫార్సులు అందాయన్నారు.

ఇందులో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, విజయవాడ సెంట్రల్, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లి శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయని ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇక‌, ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయని.. పోలింగ్ కేంద్రాల వద్ద మెడికల్ కిట్ లు కూడా ఏర్పాటు చేస్తున్నామని, నీడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com