కొత్త సంవత్సరం కానుకగా రాజశేఖర్ 'కల్కి'ఫస్టులుక్!
- December 31, 2018తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్ గా ఎంట్రీ ఇచ్చి 'అంకుశం'చిత్రంతో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ రాజశేఖర్. ఆ తర్వాత ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించిన రాజశేఖర్ ఫ్యామిలీ హీరోగా మారారు. తన సహనటి జీవితను వివాహం చేసుకున్న తర్వాత పలు చిత్రాలు కూడా నిర్మించారు. రాజశేఖర్ నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ మద్య 'గరుడ వేగ' లాంటి యాక్షన్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ మంచి విజయాన్ని అందుకున్నారు.
'గరుడ వేగ' హిట్ తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రశాంత్ వర్మ వినిపించిన ఈ కథ నచ్చడంతోనే మరోచిత్రానికి సిద్దమయ్యారు. ఈ చిత్రం టైటిల్ 'కల్కి' దీనికి సంబంధించిన లోగో ఆ మద్య రిలీజ్ చేశారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రాజశేఖర్ యాక్షన్ మార్క్ తో కూడినదిగా ఈ చిత్రం ఉండబోతుందట.
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం కూడా తనకి హిట్ ఇస్తుందనే పూర్తి నమ్మకంతో రాజశేఖర్ వున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన