వైఎస్సార్ బయోపిక్ యాత్ర నుంచి మరో సాంగ్ రానుంది
- December 31, 2018
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' పేరుతో మూవీగా రూపొందిస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ. వైఎస్సార్ పాత్రలో మళయాల మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు. ఇక ఈచిత్రం నుండి న్యూ ఇయర్ రోజు జనవరి 1న సాయంత్రం 5గంటలకు 'రాజన్న' అనే లిరికల్ సాంగ్ విడుదలచేయనున్నారు. జగపతి బాబు , సుహాసిని , అనసూయ , రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో విడుదలకానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







