సౌదీ అరేబియాలో తలాక్..మహిళల హక్కుల సంరక్షణ
- January 07, 2019సౌదీ అరేబియాలో చాలా మంది మహిళలకు భర్తలు తమకు తలాక్ ఇచ్చిన విషయమే తెలీడం లేదు. ఆ పరిస్థితిని మార్చడానికి ఆదివారం ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. మహిళలకు తలాక్ గురించి మెసేజ్ పంపించి, విడాకుల సమాచారం అందించాలనే కొత్త నిబంధనలను ఆదివారం నుంచి సౌదీ అరేబియాలోని అన్ని కోర్టుల్లో తప్పనిసరి చేశారు. "ఈ చట్టం వల్ల పురుషులు తమ భార్యలకు సమాచారం ఇవ్వకుండానే విడాకులు తీసుకునే కేసులకు అడ్డుకట్ట పడుతుంది" అని స్థానిక మహిళా న్యాయవాదులు చెప్పారు. ఇలాంటి కేసులను 'రహస్య విడాకులు'గా భావిస్తుంటారు.
చట్టంలోని మార్గనిర్దేశకాలు మహిళలకు వారి వైవాహిక స్థితి గురించి పూర్తి సమాచారం ఉండాలని చెబుతున్నాయి. ఈ నిబంధన ద్వారా వారికి దక్కాల్సిన భరణం, పోషణ ఖర్చులు లాంటి హక్కులను సంరక్షించవచ్చని భావిస్తున్నారు. సౌదీ అరేబియా గత ఏడాది మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇది దశాబ్దాలపాటు కొనసాగుతూ వచ్చింది.
మహిళల హక్కుల సంరక్షణ
"మహిళలకు విడాకులు ఇచ్చినపుడు వారి హక్కులను సంరక్షించేలా, విడాకులకు ముందు అటార్నీ అధికారాలు దుర్వినియోగం కాకుండా ఈ కొత్త చట్టం నిర్ణయాలు తీసుకుంటుందని" సౌదీ అరేబియా న్యాయవాది నస్రీన్ అల్ గామదీ బ్లూంబర్గ్‌తో చెప్పారు. "చాలా మంది మహిళలు భర్తలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తలాక్ ఇచ్చారని కోర్టుల్లో అపీల్ చేశారు" అని న్యాయవాది సామియా అల్ హిందీ స్థానిక పత్రికతో చెప్పారు. ఆర్థిక, సామాజిక సవరణల ప్రక్రియలో భాగంగా ఈ కొత్త నిబంధనలు అమలు చేసినట్టు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ చెప్పారు. వీటి ప్రకారం మహిళలకు ఫుట్‌బాల్ మ్యాచ్ చూడ్డానికి, సంప్రదాయం ప్రకారం పురుషులే చేయాలని చెప్పే చాలా పనులు చేయడానికి అనుమతులు ఇచ్చారు.
సౌదీ అరేబియా మహిళలు ఇప్పటికీ చేయలేనివి
సౌదీ అరేబియాలో మహిళలు ఇప్పటికీ చేయలేనివి కొన్ని అలాగే ఉన్నాయి. అంటే ఆ దేశంలోని మహిళలు ఇప్పటికీ కొన్ని పురుషులు అంటే భర్త, తండ్రి, సోదరుడు లేదా కొడుకు అంగీకారంతో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అవి...
పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు
విదేశీ యాత్ర
వివాహం
బ్యాంక్ అకౌంట్ తెరవడం
వ్యాపార చేయడం
ప్రత్యామ్నాయ సర్జరీలు
పురుషుల సంరక్షణ వ్యవస్థ ఉండడం వల్ల సౌదీ అరేబియాను మధ్యప్రాచ్యంలో అత్యంత లైంగిక అసమానత ఉన్న దేశంగా భావిస్తారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు