ఈ నెల 25న సూపర్ 30 విడుదలకు సిద్ధమవుతోంది
- January 07, 2019
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న కొత్త చిత్రం సూపర్ 30. వికాస్ బాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విద్యావేత్త ఆనంద్ కుమార్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. పాట్నా నగరానికి చెందిన ఆనంద్.సూపర్ 30 అనే కార్యక్రమం ద్వారా అత్యంత ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లకు ఐఐటీ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి దాకా సూపర్ 30 ద్వారా ఎందరో పేద విద్యార్థులు ఐఐటీలో ప్రవేశం పొందారు. ప్రపంచంలో ఎందరినో ఆలోచింపజేసింది ఆనంద్ కుమార్ కృషి. సమాజం పట్ల ఆయనకున్న సేవాదృక్పథం ఇప్పుడు బాలీవుడ్‌ను ఆకర్షించింది. ఈ నేపథ్యంతోనే సూపర్ 30 రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ 30లో నటించడంపై హృతిక్ స్పందిస్తూ..మన జీవితాల్లో అత్యంత గొప్ప విషయం సేవ. సమాజానికి, మన తోటి మనుషులకు సాయం చేయడం అనేది అత్యుత్తమం. నా పిల్లలకు ఇదే విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. రేపు నేను వాళ్లకు ఇవ్వబోయే అసలైన ఆస్తి సేవా దృక్పథమే అనుకుంటాను.
ఈ సామాజిక సేవ మన చుట్టూ సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. తద్వారా ప్రపంచాన్ని మార్చే శక్తినిస్తుంది. అన్నారు. ఈ నెల 25న సూపర్ 30 విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







