టూరిస్టులపై ఉగ్రదాడి...15 మంది మృతి
- January 16, 2019మరోసారి ఉగ్రదాడి ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసింది. కేవలం టూరిస్టులే లక్ష్యంగా జరిగిన ఈ దాడితో ఉగ్రమూకల లక్ష్యం తెలుస్తుంది. తాజాగా జరిగిన ఘటనలో, కెన్యా రాజధాని నైరోబిలో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. విదేశీయులే లక్ష్యంగా ఓ హోటల్‌పై దాడులకు తెగబడ్డారు. నైరోబిలోని వెస్ట్‌ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో 'డస్టిట్ డీ2' హోటల్ వద్ద జరిగిన ఈ ఘటనలో 10 నుంచి 15 మంది వరకు చనిపోయారని ప్రాథమికంగా నిర్థారించారు. వివరాల్లోకి వెళితే.విదేశీయులు అధికంగా ఉండే హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రమూకలు తొలుత హోటల్ ప్రాంగణంలో పార్కింగ్ చేసి ఉన్న వాహనాలపైకి బాంబులు విసిరి భయోత్పాతం సృష్టించారు. అనంతరం ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. దాడి అనంతరం ముష్కరులు తుపాకులతో కాల్పులకు దిగారు.
ఈ ఘటనలో ఐదుగురు ఘటనా స్థలిలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ అమెరికన్ కూడా ఉన్నారని భావిస్తున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాకున్నా 10 నుంచి 15 వరకు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి సమాచారం అందగానే హుటాహుటిన చేరుకున్న భద్రతా బలగాలు హోటల్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఘటనను ఆ దేశ మంత్రి ఫ్రెడ్మాషియాంగ్ ఖండించారు. ఉగ్రమూకలు ఇటువంటి చర్యలతో మమ్మల్ని ఓడించలేరని ప్రకటించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని 'ఆల్ షహాబ్' ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం