హాస్యబ్రహ్మ కు హార్ట్ సర్జరీ!
- January 16, 2019ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హర్ట్ ఇన్సిస్టిట్యూట్‌లో చేరిన ఆయనకు సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్‌లు చేస్తున్నారు. ఆయన కుమారులు గౌతమ్, సిద్ధార్థ్‌లతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి హాస్యలోకపు రారాజుగా వెలుగొందిన బ్రహ్మానందంకు ఇటీవల సినిమాలు తగ్గాయి.
తాజా వార్తలు
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..