క్యాన్సర్‌ని జయించిన ప్రముఖ హీరో కుమారుడు
- January 16, 2019బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కుమారుడు క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకున్నాడు. దీంతో ఇమ్రాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమాన్ క్యాన్సర్‌ను జయించాడని సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
“అయాన్ ఐదేళ్ల పొరాడి క్యాన్సర్‌ను జయించాడు. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. అలాగే ఆయాన్ కోలుకోవాలని ప్రార్థనలు చేసి, విష్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారందరూ కోలుకోవాలని ఎప్పుడూ దేవుడ్ని ప్రార్థిస్తూనే ఉంటాను”. అంటూ ఇమ్రాన్ ఇన్‌స్ట్రాగామ్‌లో తన కూమరుడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు అయాన్‌ను ఆశీర్వదించారు. అయాన్‌కు క్యాన్సర్ ఉన్న విషయం 2014లో బయటపడింది. ఆ విషయం తెలిసి నా భార్య చాలా బాధపడింది. కానీ తన బాధ ఎక్కడ పైకి కనిపించలేదు. కానీ నేను తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నా. బాబుని తను ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా చూసుకుంది. చికిత్స సమయంలో బాబు పక్కనే ఉంటూ ప్రతిది తనే చూసుకుంది. నేను షూటింగ్లో బిజీగా ఉన్న తను బాబుతోనే ఉంది. నిజంగా భావోద్యేగాలు అణుచుకోవడంలో మహిళలకు ఎవరూ సాటి లేరు. నిజంగా తనకు హ్యాట్సాఫ్ చెప్పాలి’ అని అన్నారు.
తాజా వార్తలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్‌లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన