భారతీయుడు -2 ఫస్ట్ లుక్ పోస్టర్
- January 16, 2019సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు శంకర్ భారతీయుడు-2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. 2 దశాబ్ధాల క్రితం ఇండియన్ సెల్యులాయిడ్‌పై సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా రూపొందనున్న భారతీయుడు-2 సినిమా జనవరి 18న సెట్స్‌పైకి వెళ్లనుంది. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమాలో తండ్రి సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మర్మకళతో అవినీతిపరులను అంతమొందించడం ఆ సినిమాను మిగతా చిత్రాలకన్నా ప్రత్యేకం చేసింది. తాజాగా విుదల చేసిన భారతీయుడు-2 ఫస్ట్ లుక్ పోస్టర్లోనూ అదే మర్మకళను ప్రదర్శిస్తున్నట్టుగా వున్న స్టిల్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. వాస్తవానికి ఈ సినిమా గురించి గతేడాదే ప్రకటన వెలువడినప్పటికీ... తన రాజకీయ పార్టీ ప్రకటన, పార్టీ ఏర్పాటు పనులతో కమల్‌హాసన్ బిజీగా వుండగా మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.o సినిమాతో శంకర్ బిజీగా ఉండటంతో భారతీయుడు-2 మూవీ పట్టాలెక్కడం ఆలస్యం అవుతూ వచ్చింది. భారతీయుడు సీక్వెల్లో కమల్ సరసన కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తోంది.
1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఏ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ఆ సినిమా పాటలన్నీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. కాగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌కి యంగ్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు