విజయ బాపినీడు కన్నుమూత

- February 12, 2019 , by Maagulf
విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో(86) కన్నుమూశారు. చిరంజీవి, శోభన్ బాబులతో హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నెం 786, మగధీరుడు వంటి బ్లాక్ బస్టర్స్‌ని తెలుగు పరిశ్రమకి అందించారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి కాగా చిత్ర పరిశ్రమలో ఆయన విజయ బాపినీడుగా సుపరిచితం. 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో ఆయన జన్మించారు. గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన మృతికి చిత్ర పరిశ్రమకి సంబంధించిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్నారు. విజయ బాపినీడు దర్శకుడిగా డబ్బు డబ్బు డబ్బు (1981),పట్నం వచ్చిన పతివ్రతలు (1982),మగమహారాజు (1983), మహానగరంలో మాయగాడు (1984), హీరో (1984), భార్యామణి (1984), మహారాజు (1985), కృష్ణగారడి (1985), మగధీరుడు (1986), నాకు పెళ్ళాం కావాలి (1987), ఖైదీ నెంబరు 786 (1988), దొంగకోళ్ళు (1988), మహారజశ్రీ మాయగాడు (1988), జూలకటక (1989), మహాజనానికి మరదలు పిల్ల (1990), గ్యాంగ్ లీడర్ (1991), బిగ్ బాస్ (1995), కొడుకులు (1998), ఫ్యామిలీ (1994) వంటి చిత్రాలు చేశారు. నిర్మాతగా యవ్వనం కాటేసింది (1976) అనే చిత్రం చేశారు.

సినిమా దర్శకులుగా, పత్రికా సంపాదకులుగా విజయ బాపినీడు సేవలని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com