ఆసక్తిరేపుతున్న విశ్వనాథుడి 'విశ్వదర్శనం'

- February 19, 2019 , by Maagulf
ఆసక్తిరేపుతున్న విశ్వనాథుడి 'విశ్వదర్శనం'

కే విశ్వనాథ్‌. తెలుగు నేల ఆణిముత్యం. ఆయన దర్శకత్వంలో కలకాలం నిలచిపోయే ఎన్నో అపురూప చిత్రాలు వచ్చాయి. శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం.. ఇలా ఎన్నోసినిమాలను తెలుగు ప్రజలకు ఆయన అందించారు. ఆ లెజెండర్ దర్శకుడి జీవితం ఆధారంగా విశ్వదర్శనం పేరుతో బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్దన్‌ మహర్షి దర్శకత్వంలో ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
 
అయితే.. మంగళవారం నాడు కే విశ్వనాథ్‌ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే సోమవారం 'విశ్వదర్శనం' టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో విశ్వనాథ్‌పై పలువురు ప్రముఖులు చెప్పే విషయాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ప్రతిభ గురించి, మనస్తత్వం గురించి, పనిచేసిన విధానం గురించి ఆయన వారు చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది. నిజానికి.. ఎంతసేపూ హీరోహీరోయిన్లు, రాజకీయ నేతల బయోపిక్‌లుగా వచ్చాయి. అయితే.. ఇలా ఓ దర్శకుడిపై బయోపిక్ వస్తుండడం అందరిలో ఆసక్తిని రేపుతోంది.
 
ఈ సందర్భంగా కే విశ్వనాథ్‌ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తానుగొప్పవాణి అనీ. అందరికీ తెలియాలనే ఆశ తనకు లేదని, కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాలని. అటువంటి ప్రయత్నమే ఈ విశ్వదర్శనం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్ధన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదని ఆయన అన్నారు. దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ ఈ సినిమాలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదని. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడిందన్న విషయాన్నే ఈ సినిమాలో చూపించబోతున్నామని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com