పుల్వామా దాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్..భారత్ దాడికి ప్రతిదాడి తప్పదు..
- February 19, 2019
ఇస్లామాబాద్: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పుల్వామా ఘటనపై తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ఆధారాలు లేకుండా భారత్ తమను నిందిస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు.
'ఉగ్రదాడితో పాక్‌కు సంబంధాలున్నాయని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఇలాంటి దాడి చేస్తే మాకేంటి ప్రయోజనం. మేం ఉగ్రవాదాన్ని కాదు స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ దిశగా పయనిస్తున్నాం. పుల్వామా దాడిపై మమ్మల్ని నిందించకండి. ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ మాపై ఆరోపణలు చేస్తోంది. శాంతి కోసం చేస్తున్న పోరాటంలో మేం ఇప్పటికే లక్షల మంది ప్రజలను కోల్పోయాం. మీరన్నట్లు నిజంగానే దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు తేలితే దర్యాప్తునకు సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దానికి నేను హామీ ఇస్తున్నా' అని ఇమ్రాన్‌ఖాన్ చెప్పుకొచ్చారు.
'యుద్ధాన్ని ప్రారంభించడం సులువే. అది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ యుద్ధం ఎక్కడ ముగుస్తున్నది ఆ దేవుడికే తెలియాలి. సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలి. దాడి చేస్తే పాక్ ప్రతిఘటించదని భారత్ భావిస్తోంది. కానీ మీ చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది' అని ఇమ్రాన్ హెచ్చరించారు. కశ్మీర్ ప్రజలు చావుకు భయపడట్లేదని భారత్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్